ప్రజాశక్తి – విజయనగరం : ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటైన ఇండస్ టవర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ సహకారంతో విజయనగరంలో స్మార్ట్ క్లాస్‌రూమ్ కార్యక్రమాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా విద్యాశాఖాధికారి (DEO) యు. మాణిక్యం నాయుడు విజయనగరం జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్ సౌకర్యాలను ప్రారంభించారు. ఇండస్ టవర్స్ సంస్థ యొక్క ప్రధాన CSR కార్యక్రమం “సాక్షం”లో భాగమైన ఈ చొరవ తరగతి గదులను డిజిటల్ మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం, విద్యావేత్తలు, విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలపడమే ఇండస్ టవర్స్ లక్ష్యంగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డిజిటల్ ఇండియా’ మిషన్ కు అనుగుణంగా ప్రారంభించిన ఈ స్మార్ట్ క్లాస్‌రూమ్ కార్యక్రమం 1,600 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ నైపుణ్యాల పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 130 మందికి పైగా ఉపాధ్యాయులకు వారి బోధనా పద్ధతుల్లో డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా చేర్చడానికి శిక్షణ ఇవ్వబడింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల గౌరవనీయ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.., “ఇండస్ టవర్స్ ప్రారంభించిన స్మార్ట్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ డిజిటల్ యాక్సెస్, చేరికను నిర్ధారించడం ద్వారా విజయనగరం జిల్లాకు డిజిటల్ సాధికారత కలిగిన కమ్యూనిటీగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందని తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా పాఠశాల డిజిటల్ మౌలిక సదుపాయాలతో అమర్చబడి ఉంది. విద్యార్థులు – ఉపాధ్యాయులు ఇద్దరికీ అవసరమైన శిక్షణను అందించడంలో అంతర్భాగంగా ఉంటుందని అన్నారు.”
జిల్లా విద్యా అధికారి (DEO) యు. మాణిక్యం నాయుడు మాట్లాడుతూ., “డిజిటల్ సాధనాలను తరగతి గదులకు అనుసంధానించడం, విద్యావేత్తలకు, టీచర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ చొరవ విద్య నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. ఇది ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులతో సాధికారతను కల్పిస్తుండటంతో పాటు విద్యార్థులకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను సన్నద్ధం చేస్తుందనీ వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో వారు విజయం సాధించడంలో సహాయపడుతుంది. దీనిని నిజం చేయడంలో ఇండస్ టవర్స్, ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నామని పేర్కొన్నారు.”
అనంతరం ఇండస్ టవర్స్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ సిఇఓ దిలీప్ గంటా మాట్లాడుతూ.. ఇండస్ టవర్స్‌లో విద్యను వినూత్నంగా అధునాతన సాంకేతికత యొక్క శక్తిని బాగం చేయడాన్ని మేము విశ్వసిస్తాము. ఈ ప్రయత్నంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, భవిష్యత్ తరాలకు సాధికారత కల్పించడం అనే మా నిబద్ధతకు స్మార్ట్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ ఒక నిదర్శనం. విజయనగరంలోని ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం, 130 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మేము విద్యను మెరుగుపరచడమే కాకుండా 1,600 మందికి పైగా విద్యార్థులకు అవకాశాలను సృష్టిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.