ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శనివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ, వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలిశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి స్వామితో ప్రత్యేకంగా మాట్లాడారు.
