విశాఖ : స్కూటర్‌ను మినీ వ్యాన్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం విశాఖలోని సింహాచలం బాలాజీ నగర్ బస్ స్టాప్ సమీపంలో జరిగింది. దేవస్థానం వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం వద్ద సింహాచలం నుంచి గోపాలపట్నం వైపు వెళుతున్న స్కూటర్‌ను మినీ వ్యాన్ ఢీకొట్టడంతో స్కూటర్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియవలసి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
