విధుల్లోకి మిర్చి యార్డు ప్రత్యేక కార్యదర్శి చంద్రిక

Jan 31,2025 23:49

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డు ప్రత్యేక కార్యదర్శిగా ఎ.చంద్రిక శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన వీరాంజనేయులు రాజమండ్రికి బదిలీ అయ్యారు. విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రిక డిప్యూటేషన్‌పై ఇక్కడ నియమించారు. యార్డులో రైతులకు అన్ని సౌకర్యాలు సమకూస్తామని, రైతులకు ఆహార పానియాలు, వసతిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చంద్రిక చెప్పారు. మిర్చి వ్యాపారంలో అక్రమాలను లేకుండా చూస్తామని, అమ్మకం సందర్భంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

➡️