యల్లనూరు (అనంతపురం) : పుట్లూరు మండలం కొండగారికుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సుదర్శన్ నాయుడు అనే రైతుకు చెందిన 1000 అరటి చెట్లను గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నరికి వేశారు. శుక్రవారం బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం … యల్లనూరు మండలం బప్పేపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో 7 ఎకరాలు భూమి ఉంది. 3 ఎకరాలలో 3500 అరటి చెట్లు నాటడం జరిగిందని, కోత దశ లో వున్న 1000 అరటి చెట్లతో పాటు పి వి సి పైపు లైన్ ను కూడా దుండగులు ధ్వంసం చేసారని తెలిపారు. సుమారు రూ.3 నుండి 3.5 లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న సి ఐ సత్యబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.