ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని జన్నాడకు చెందిన భావన శ్రీనివాస్ కూటమి విజయోత్సవ కృతజ్ఞతా పాదయాత్ర సోమవారం చేపట్టగా ముఖ్య కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర టిడిపి తెలుగు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ, యువ నేత బండారు సంజీవ్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ … సార్వత్రిక ఎన్నికల్లో సత్యానందరావు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని, అలా జరిగితే స్వగ్రామం జొన్నాడ నుండి శ్రీశైలం వరకు నడిచి వచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నానన్నారు. మండల పరిధి కూటమి నాయకులు, ప్రజలందరి క్షేమాన్ని ఆకాంక్షించానన్నారు. వారి ఆశీర్వాదాలు తనకు అందజేసి తన పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తాడి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షులు గొడవర్తి బాబి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఈదల నల్లబాబు, మాజీ జెడ్పిటిసి రామానుజుల శేషగిరిరావు, కూటమి నాయకులు కొత్తపల్లి కఅష్ణ, పామర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
