సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బీఎన్‌ శంకుస్థాపన

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ వార్షికోత్సవాలలో భాగంగా మండలంలోని గుమ్మళం పాడు గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బీఎన్‌ విజరు కుమార్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, పార్లమెంట్‌ రైతు అధ్యక్షులు నెప్పలి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు మొలకలపల్లి శ్రీనివాసరావు, నాయకులు బొడ్డపాటి చంద్రశేఖర్‌, బొడ్డపాటి రమణారావు, బొడ్డపాటి రామయ్య, గ్రామ మాజీ సర్పంచ్‌ నెప్పలి కనకయ్య, బొడ్డపాటి శ్రీనివాసరావు, పీఆర్‌ డీఈ కృష్ణమోహన్‌, ఎంపీడీఓ సురేష్‌బాబు, తహశీల్దారు ఆదిలక్ష్మి, మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, పార్లమెంట్‌ ఎస్‌సి సెల్‌ సెక్రటరీ రంపతోటి అంకారావు, మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు కంకణాల గోపి కృష్ణ, నువ్వల మీరయ్య, తెలుగు యువత ముప్పరాజు శ్రీనివాసరావు, నార్నె మాధవీలత, చేజర్లయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️