ప్రజాశక్తి – నందవరం : ‘ప్రజాధర్బార్’ కార్యక్రమంకు 330 వినతులు వెళువెత్తాయి.మంగళవారం నందవరం గ్రామంలో ‘ప్రజాధర్బార్’ కార్యక్రమంను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నిర్వహించారు.ఈ కార్యక్రమనికి మండలం ప్రజలు భారీ ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు.అనంతరం వినతి పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంకు వివిధ రకాల సమస్యలపై 330 వినతులు రావడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు.వైసీపీ పాలనలో సమస్యలు పేరుకుపోయి మండలం సమస్యల వలయంల మారిందని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వం గ్రామాలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేక పోయిందన్నారు.వైసిపి నిర్లక్ష్య పాలన వల్ల సమస్యలు పేరుకుపోయాయి.వైసిపి ప్రభుత్వం నిర్వహించిన రీసర్వే వల్ల భూసమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడం కోరకు ‘ప్రజాదర్బార్ ‘కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రజాదర్బార్ కు వచ్చిన వినతులలో ఎక్కువగా భూసమస్యలు, రోడ్లు,పెన్షన్లు,త్రాగునీరు సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.గురురాజ్ దేశయ్, మాధవరావు దేశాయ్,మాచాపురం కాసింవలి,ధర్మపురం గోపాల్, చిన్నరాముడు,మైనార్టీ నాయకులు ఈసా, బ్రహ్మానందరెడ్డి,వెంకటరామరెడ్డి,నాగలదిన్నె ఉరుకుందు,పెద్దకొత్తిలి ఆదిశేషు,కైరవాడి వీరేష్,మిట్ట సోమపురం వీరేష్, కనకవీడు డబ్బ ఈరన్న,మండల అధికారులు,టిడిపి నాయకులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.
