వెంకన్నకు పట్టు వస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే దంపతులు

Feb 21,2025 19:21 #alamuru, #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభ స్వాగతంతో అర్చక స్వాములు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం ఈవో వీర్రాజు చౌదరి మాజీ ఆలయ కమిటీ చైర్మన్ వైట్ల శేషుబాబు నీటి సంఘం అధ్యక్షుడు వైట్ల గంగరాజు పారిశ్రామికవేత్త వట్టికూటి సతీష్ బాబు, నేతలు సలాది నాగేశ్వరరావు, దండంగి మమత రామారావు, పెద్దింటి కాశి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

➡️