కేన్సర్‌ బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కేన్సర్‌ బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ప్రజాశక్తి- అడ్డతీగల : మండలంలోని వీరభద్రపురం గ్రామంలో పందిరి గవర్‌ రాజు కుమారుడు పందిరి అభిషేక్‌సాగర్‌ రెండేళ్లుగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ,విజయ భాస్కర్‌ ఆర్థికసాయం అందజేశారు.ఉచిత అంబులెన్స్‌లో తన సొంత ఖర్చులతో గుంటూరు కేన్సర్‌ హాస్పిటల్‌కు తరలించడంతో పాటు వైద్యానికి ఆర్థికసాయం అందించారు. తెలుగుదేశం సీనియర్‌ నాయకులు బుర్లె హరిబాబు, ఎడ్ల శ్రీనివాస్‌, వీరారెడ్డి ,రాజేశ్వర్‌ రావు వీరబాబు, అడ్డతీగల మండలం జనసేన నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి రాజవోమ్మంగి మండలం అధ్యక్షులు జనసేనబొదిరెడ్డి త్రిమూర్తులు , ఉపాధ్యక్షులు అప్పారావు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

➡️