దక్షిణ ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గణేష్‌ కుమార్‌

May 14,2024 14:54 #MLA, #people, #thanks, #YCP Leaders

విశాఖ : ఓటు వినియోగించుకొని వైసిపి ప్రభుత్వానికి ఆశీర్వచనాలు అందజేసిన దక్షిణ ప్రజలందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ముగింపు సందర్భంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. వార్డుల్లో వైసిపి పై ఓటింగ్‌ ప్రభావం ఎంత వరకు జరిగింది.. ఎంత మెజార్టీ సాధించగలరు ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ .. 47 రోజుల ఎన్నికల ప్రచారంలో కష్టపడిన ప్రతి కార్యకర్త, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి వైసిపికి ఓటింగ్‌ శాతం పెంచారని, ప్రజల కూడా జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్‌, కోడూరు అప్పల రత్నం, చెన్నా జానకిరామ్‌, మాసిపోగు మేరీ జోన్స్‌, వార్డు అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, ఆలయ చైర్మన్లు, డైరెక్టర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️