ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : స్వచ్ఛత హి సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు గ్రామాలలో, పాఠశాలలో అందరూ బాధ్యతగా నిర్వహించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా లూటుకుర్రు హైస్కూల్లో సోమవారం ఎమ్మెల్యే విద్యార్థులకు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ బోనం సత్తిరాజు రూ.76 వేల వ్యయం తో సమకూర్చిన పండ్ల మొక్కలను విద్యార్థులందరికీ పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కనుగుణంగా విద్యా కమిటీ చైర్మన్ చేపట్టిన అభివఅద్ధిని ఎమ్మెల్యే ప్రశంసించారు. చైర్మన్ కు పూలమాల వేసి శాలువాతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులు మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమై మంచి ఆరోగ్యం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, సర్పంచ్ అడబాల తాతకాపు, జడ్పిటిసి కసిరెడ్డి అంజిబాబు, బోనం బాబు, శిరిగినేడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, మొల్లేటి శ్రీనివాస్, గనశాల దీపిక, పెనుమాల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.