ప్రజాశక్తి-విజయనగరంకోట : టిడిపి కార్యాలయం అశోక్‌బంగ్లాలో బుధవారం ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. హౌసింగ్, పింఛన్లు, రోడ్లు, కాలువలు, దోబీఖానాలుపై పలు వినతులు వచ్చాయి. వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకుల పాల్గొన్నారు.
