ప్రజాశక్తి- గోకవరం (తూర్పు గోదావరి) : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివఅద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం గోకవరం మండలంలోని తిరుమలయపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ పురంశెట్టి శివాజీ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు 40 లక్షలతో 4 సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని శంకుస్థాపన చేశారు. అలాగే ప్రజలుకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ నిధులు 3లక్షల85వేలుతో నిర్మించిన ఆర్‌ఓ ప్లాంట్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలన వల్ల ఆర్థిక పరిస్థితులు గాడి తప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం అభివఅద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. అనంతరం తిరుమలాయపాలెంలో ప్రసిద్ధిగాంచిన శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ బాబు, జగ్గంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, టిడిపి నాయకులు ఉంగరాలు గణేష్,సాలపు నలమహారాజు, గునిపే భరత్, ఉండమట్ల దొరబాబు, గళ్ళ రాంబాబు, శానంశెట్టి చక్రరావు, వల్లేపల్లి సత్యనారాయణ, వాకాడ బుజ్జి, కోడూరు సత్యనారాయణ, పెరుమల్ల సూర్యప్రకాష్, జంగిరెడ్డి ప్రసాద్, ఆకుల స్వామి, ఆముదాల శ్రీనివాసరావు, జయరాజు, శ్రీను పాల్గొన్నారు.