గొల్లపల్లి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర విచారం

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : మచిలీపట్నం రూరల్‌ చిన్నాపురం గ్రామానికి చెందిన బొందిలి సునీత్‌ భారు (45), పి.సాయిసింగ్‌ (06) మృతి చెందడం, మరో నలుగురు నూజివీడు మండలం గొల్లపల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంపై మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే రవీంద్ర నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో మాట్లాడి అధికారుల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విజయవాడ తరలించగా మెరుగైన వైద్య సేవలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు.

➡️