గొట్టిపాటి లక్ష్మితో ఎమ్మెల్యే కొండయ్య భేటీ

ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, టిడిపి యువ నాయకులు డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, కడియాల రమేష్‌బాబులను ఆదివారం స్థానిక గొట్టిపాటి లక్ష్మి నివాసంలో చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. నాలుగు నెలల కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్‌ రాజకీయాలు ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై వీరి మధ్య చర్చ నడిచింది. రాజకీయాలతో పాటు వైద్యురాలిగా పేదలకు సేవలందిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మిని శాసనసభ్యులు కొండయ్య అభినందించారు.

➡️