మంగళగిరి (గుంటూరు) : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికలో కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం పాల్గొన్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరి సమస్యలను ఓపిగ్గా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఆయా అర్జీలను సమస్యను బట్టి ఆయా శాఖలకు పంపుతామని పేర్కొన్నారు. మాజీమంత్రి పీతల సుజాత, తదితరులు పాల్గొన్నారు.