వికలాంగులు ఎందులోనూ తీసిపోరు : ఎమ్మెల్యే మాధవి

Jun 10,2024 00:36

బహుమతి ప్రధానోత్సవంలో గళ్లా మాధవి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
చెస్‌ అసోసియేషన్‌ ఫర్‌ విజువల్లి ఛాలెంజ్డ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆధ్వర్యంలో గుంటూరు సమర్థన వికలాంగుల సంస్థ సహకారంతో గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజీలో తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆదివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే డాక్టర్‌ గళ్లా మాధవి హాజరై మాట్లాడారు. వికలాంగులు ఎందులోనూ తీసిపోరని అన్నారు. క్రమశిక్షణతో పాటు తాము పూర్తిస్థాయి విజయాన్ని సాధించాలనే విశ్వాసంతో చెస్‌ ఆడుతున్న వారిని చూడటం చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఇటువంటి వారు జీవితంలో అత్యంత తెలివి కలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. సమర్థన సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ పరమహంస మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఎంపిక పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుండి 21 మంది క్రీడాకారులను, తెలంగాణ నుండి 10 మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఆగస్టులో జరగనున్న సౌత్‌జోన్‌ టోర్నమెంటుకు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామసేతు పెయింట్స్‌ అండ్‌ హార్డ్‌ వేర్‌ అధినేత పి.సుధాకర్‌, చెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.వెంకట్‌ రెడ్డి, ట్రెజరర్‌ ఎం.ప్రసన్నకుమార్‌, ఆర్బిటర్‌గా గోపీనాథ్‌, సెక్రెటరీ సిహెచ్‌ కుమార్‌రాజా పాల్గొన్నారు.

➡️