ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నూతన యంత్రాల రాకతో నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ సాధ్యమవుతుందని నగర మేయర్ మహమ్మద్ వసీం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఆకాంక్షించారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు, కమిషనర్ రామలింగేశ్వర్, డిప్యూటీ మేయర్ వాసంతి, తదితరులు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.1.25 కోట్ల వ్యయంతో నూతనంగా 15 వ ఆర్థిక సంఘం నిధులతో రూ.70 లక్షల వ్యయంతో 2 జేసీబీ లు,ఎన్ సి ఏ పి నిధులతో రూ.12 లక్షలతో ఒక నాలమాన్, రూ.33 లక్షలతో మూడు ట్రాక్టర్లు, రూ.10 లక్షలతో ఒక వాటర్ ట్యాంక్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన జేసీబీ లు,ట్రాక్టర్లు ద్వారా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తో పాటు వంకలు,కాలువలలో వేగవంతంగా చెత్త,వ్యర్థాల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
నూతన యంత్రాలతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యం : యంత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేయర్
