చాగల్లులో సీసీ రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలు సందర్బంగా శనివారం కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చాగల్లు మండలంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో మంజూరు కాబడిన 84 లక్ష రూపాయలతో సి సి రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపన శనివారం నిర్వహించారు. రూ.46 లక్షలతో సీసీ రోడ్లు, రూ.38 లక్షలతో డ్రైనేజీలు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చాగల్లు గ్రామ సర్పంచ్‌ ఉండమట్ల మనశ్శాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ … గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలీడం లేదన్నారు. ఆర్థిక వనరులు చేకూర్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఆర్థిక మండలిని సమకూరుస్తూ అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. చాగల్లు గ్రామంలో (అశోక్‌ నగర్‌ ఏరియా ) ఇంటర్నల్‌ సిసి రోడ్‌ రూ.10 లక్షలతో మీనానగరం సిసి రోడ్‌ రూ.12 లక్షలతో, నెలటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ఎడ్లపల్లి ఉమా రజిని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిసి రోడ్‌ కమ్‌ డ్రైన్‌ 10 లక్షలు రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఆయా గ్రామ సర్పంచులు అధ్యక్షతన పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఉనగట్ల గ్రామంలో సిసి రోడ్‌ .7.50, 5 లక్షలతో, బ్రాహ్మణ గూడెం (వెంకటేశ్వర స్వామి కాలనీ) గ్రామంలో సిసి రోడ్‌ రూ.5 లక్షలు, చంద్రవరం గ్రామంలో సిసి రోడ్‌ రూ. 2.5 లక్షలతో, మల్లవరం గ్రామంలో సిసి రోడ్‌ రూ.5 లక్షలతో శంఖస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో పెన్షన్లు డ్రైనేజీలు రోడ్లు నిర్మాణం వ్యక్తిగత ఆరోగ్య సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు .ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌ ఎం మేరీకమ్మ, ఎంపీడీవో ఆర్‌ శ్రీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల హరిబాబు పాల్గొన్నారు.

➡️