విద్యారంగంలో మార్పులు చేపట్టాలి : ఎమ్మెల్యే మురళీమోహన్‌

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : విద్యారంగంలో మార్పులు చేపట్టాలని పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీమోహన్‌ అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు బడివైపు ఒక అడుగు కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యలేని వారు మనుగడ సాధించలేరని ప్రతి ఒక్కరూ విద్యుత్‌ తోనే అభివృద్ధి చెందుతున్నానని విద్యావంతులైనప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందని సమాజంతో పాటు మన పరిసరాలు మన అవసరాలు సరిపోయేవి సమకూర్చుకోవచ్చని వీటిని గ్రహించి విద్యార్థులకు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ టిడిపి మండల అధ్యక్షులు జయప్రకాష్‌ నాయుడు మండల విద్యాశాఖ అధికారి టు రమేష్‌ బాబు జి ఆర్‌ కన్స్ట్రక్షన్‌ అధినేత ఈశ్వర్‌ నాయుడు సర్పంచులు ఉమాదేవి కోకా ప్రకాష్‌ నాయుడు ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️