గిద్దలూరు (ప్రకాశం) : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేటి నారాయణ ని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గిద్దలూరు నగర పంచాయతీ అభివఅద్ధికి సహకరించాలని, పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిగా పలు అంశాల పై చర్చించిన అనంతరం వినతి పత్రం అందచేశారు.
