ప్రజాశక్తి-నారాయణవనం (తిరుపతి) : నారాయణవనం సాలి వీధికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత గుడ్ల భాస్కర్ తల్లి బేబమ్మ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం ఉదయం బేబమ్మ ఇంటికి చేరుకొని ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం బేబమ్మ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ ను, అతని కుటుంబ సభ్యులను నేత ఓదార్చారు. భాస్కర్ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని, తన ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.