యాదవ్‌ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం మండల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. తన సొంత మండలంలో ఎమ్మెల్యేగా సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మండలం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, పార్టీలకు అతీతంగా అందరి సూచనలు, సలహాలతో అభివద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. సొంత మండలంలో ఎంతో కషి చేసి ప్రజలు మెజారిటీ అందించారు అన్నారు. బడా నాయకుల భూ కబ్జాల వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని, ఒకొక్కరికి రెండు డికెటి పట్టాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రెవెన్యూ అధికారులు కమిటీలు వేసి భూ పరిశీలన చేసి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని అంటూ రెవెన్యూ అధికారులకు సూచించారు. అక్రమంగా యంత్రాలు ల పెట్టి భూములు దోచుకుంటే ఒప్పుకునేది లేదని, వాహనాలు సీజ్ చేయాలని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తాననని పింఛన్ల పంపిణీలో అధికంగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఒక పంచాయతోనే 35 దొంగ పింఛన్లున్నాయని పేర్కొన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్లు, ఆధార్‌లో వయసు మార్చుకుని పింఛన్లు పొందుతున్నారని చెప్పారు. అటువంటివి విచారణ చేసి తొలగించాలి అన్నారు. తప్పు చేస్తే అధికారులపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌లు పనికి వెళ్లకుండానే డబ్బులు లాగేస్తున్నారని, వారిపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బ్రహ్మంసాగర్ నీళ్లు పిల్ల కాలువలు ద్వారా నీరు ప్రతి ఒకరాకు అందేలా చేస్తానని తెలిపారు. దారి లేని గ్రామాలకు బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రెండు లైన్ల రహదారికి కూడ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో శ్మశానాలను అభివద్ధి చేస్తా అన్నారు. సగిలేరు కాలువకు మూడు చెక్ డ్యాం ఏర్పాటు చేయాలన్నారు. సాగర్ నుంచి నీళ్లు తరలించడం చాలా దుర్మార్గమైన చర్య వీటిని అడ్డుకుంటాననని చెప్పారు. ఈ ప్రాంత వాసులకే నీళ్లు సరిపోక అల్లాడుతుంటే బయటికి తరలించడం సరైన పద్ధతి కాదన్నారు. మండల కేంద్రంలో అభివద్ధికి మాస్టర్ ప్లాన్ వేసి రాబోవు రోజులలో అభివద్ధి చేయించాలని మఠం మేనేజర్ ఈశ్వరయ్యకి తెలిపారు. మఠం అభివద్ధికి అవసరమైతే తన తనయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గ్రాండ్స్‌తో నిధులు తెచ్చి అయినా అభివద్ధి చేసి తీరుతానన్నారు. బ్రహ్మ సాగర్ నుంచి ప్రతి చెరువు నీరు అందేలా చూడాలన్నారు. రాజోలి ఆనకట్ట వద్ద పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తాన న్నారు. పదవులు శాశ్వతం కాదు అభివద్ధి చేస్తేనే ప్రజల గుండెలలో నిలుస్తా మన్నారు. బస్టాండ్ కోసం నిర్మాణం కోసం చర్యలు తీసుకు ంటామ న్నారు. మళ్ళీ వచ్చే సమావేశానికి పనులు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండల సమావేశానికి డుమ్మా కొట్టిన ఎక్సైజ్ అధికారులపై రిపోర్టు రాయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి వీరా నారాయణ రెడ్డి, ఎంపిడిఒ శివ మల్లేశ్వారప్ప , తహశీల్దార్ శ్రీనివాసులు , డిప్యూటీ తహశీల్దార్ జాన్షన్ సర్పంచ్‌లు, ఎంపీటిసిలు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు. పుట్టా సుధాకర్‌కు సన్మానం మండలానికి మొట్ట మొదటిసారిగా మండల సర్వ సభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను మండలంలోని టిడిపి నాయకులు గురువారం ఘనంగా పూలమాలలతో సన్మాంచారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు సన్నపురి శ్రీను, పోలిరెడ్డి, సాంబ శివారెడ్డి, ఎస్. ఆర్. శ్రీనువాసుల రెడ్డి, పూజ శివయ్య, చిలమల నారాయణ, మేకల సుధాకర్, గుర్రప్ప పాల్గొన్నారు.
