ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు భేషరతుగా క్షమాపణ చెప్పాలి-సిపిఎం

Apr 27,2025 12:13 #Adoni, #Kurnool

ప్రజాశక్తి – ఆదోని : ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలని సిపిఎం మండల, పట్టణ కార్యదర్శిలు లింగన్న, లక్ష్మన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ తిప్పన్న నాయకులు వెంకటేష్ భాష డిమాండ్ చేశారు. ఆదోని పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశం ఉద్దేశించి మాట్లాడారు. పేదల ఇల్లు కూల్చివేతను తప్పు పట్టిన ప్రజా ఉద్యమ నాయకులు శ్రీనివాసరావుపై రఘురామ కృష్ణంరాజు అవమానకరంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించాలని వారు తెలిపారు. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అబద్ధాలు అనుచిత వ్యాఖ్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావని చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా సమాధానం చెప్పాలన్నారు. నిరంతరం ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే సిపిఎంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అధికారమదంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. బతికి పోయావు అని బెదిరింపులకు దిగడం ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో, నేర్పాలనుకుంటున్నారో పరిశీలన చేసుకోవాలని అన్నారు. కోట్లాది రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పేదల ఇళ్ళను కూలగొట్టడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుందని విమర్శించారు . ఒక ఊళ్లో గుడిసెలు పీకితే తప్ప మరో ఊర్లో మంచినీళ్లు అందించలేరా దీనినే అభివృద్ధి, ప్రజా పరిపాలన అంటారా అని నిలదీశారు. ఉండి నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోగలరా చేతనైతే అలాంటి పనులకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం ఓట్ల కోసం పాకులాడే అలాంటి వాళ్లకు కమ్యూనిస్టులు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలనివారు  డిమాండ్ చేశారు.

➡️