ప్రజాశక్తి-చింతలపూడి(ఏలూరు) : చింతలపూడి ప్రభుత్వం ఏరియా హాస్పిటల్‌లో కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం తెలుసుకున్నారు. నేరుగా కార్మికులతోనే మాట్లాడారు. అన్ని పరిష్కరిస్తానని, కాంట్రాక్టర్‌తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. పక్షం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మరలా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు.
