అమరజీవికి ఎమ్మెల్యే సత్యానందరావు నివాళి

Mar 16,2025 11:37 #Konaseema

ప్రజాశక్తి-కొత్తపేట: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాడపాలెం కార్యాలయం వద్ద శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్‌,సాదే శ్రీనివాస్‌,మెర్ల గోపాలం,విల్లా మారుతి,బీరా ఇసాక్‌,గనిశెట్టి వీరేష్‌,కాస సాగర్‌,ముద్రగడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️