ప్రజాశక్తి – కడప అర్బన్ మహా త్మా గాంధీజీ ఆశయాలకు అనుగు ణంగా ప్రతి ఒక్కరూ నడవాలని, కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కడప శాసన సభ్యురాలు ఆర్. మాధవి, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఒ. నందన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని గాంధీనగర్ పాఠశాల వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ 155 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గాంధీ ప్లాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, ఆయనను మనమందరం మననం చేసుకోవాలని అన్నారు. మహనీయుల ఆశయ సాధనకు ఉద్యోగులు కషి చేయాలని, పేదవారికి న్యాయం చేయాలన్నారు. కాలుష్య నివారణలో భాగంగా ఏర్పాటుచేసిన పొల్యూషన్ కంట్రోల్ ఫౌంటెన్‌లను గాంధీ ప్లాజాలో ఏర్పాటు చేశామని చెప్పారు. గాంధీ ప్లాజా నగర పాలక సంస్థ రూ.90 లక్షల అంచనా వ్యయంతో ఎన్‌సిఎ పి విధులతో నిర్మించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెలిగండ్ల లక్ష్మయ్య, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.