రామోజీరావుకు ఎమ్మెల్యే శ్రద్ధాంజలి

Jun 8,2024 20:38

ప్రజాశక్తి- గంట్యాడ :శనివారం తెల్లవారు జామున మృతి చెందిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ శ్రద్ధాంజలి ఘటించారు. మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈయనతో పాటు మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు, టిడిపి నాయకులు కొండపల్లి భాస్కర నాయుడు, జి.శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు. బొబ్బిలి: ఈనాడు అధినేత పద్మవిభూషణ్‌ రామోజీ ఆకస్మిక మరణం పత్రిక రంగానికి తీరని లోటని, దానిని ఎవరూ పూడ్చలేరని కారుణ్య ఫౌండేషన్‌ అధ్యక్షులు రోటరీ క్లబ్‌ ప్రతినిధి జెసి రాజు అన్నారు. శనివారం ఆయన రామోజీ మృతికి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.నెల్లిమర్ల: ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి బాధాకరమని టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, విజయనగరం పార్లమెంట్‌ మహిళ అధ్యక్షరాలు సువ్వాడ వనజాక్షి, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌ అన్నారు. శనివారం వారు రామోజీరావు మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల టిడిపి నాయకులు పాల్గొన్నారు. చీపురుపల్లి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చీపురుపల్లి టిడిపి ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్షర యోధుడిగా పేరుగాంచిన, క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష, అంకితభావంతో ముందుకుసాగి దశాబ్దాల కాలంగా మీడియా రంగంలో మహారాజుగా నిలిచిన రామోజీరావు మృతి చాలా బాధాకరమన్నారు. డెంకాడ: మండల కేంద్రంలో రామోజీరావు చిత్రపటానికి టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పతివాడ అప్పలనారాయణ, పల్లె భాస్కరరావు, కర్రోతు సత్యనారాయణ, కలిదిండి పాణీరాజు, పతివాడ శివరామ విద్య సాగర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️