వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్‌ జిల్లా) : మైలవరం నియోజకవర్గ పరిధిలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి, కేతనకొండ గ్రామాల్లో సర్పంచి నళిని విన్‌ స్టన్‌, యునైటెడ్‌ క్రిస్టియన్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇండియా వారి సౌజన్యంతో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను శనివారం పంపిణీ చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వాటిని స్వయంగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులకు రాష్ట్రప్రభుత్వం నుంచి 75 వేల నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశామన్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వరద బాధితులను, పేద కుటుంబాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. పేదలను ఆదుకునే వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️