విజయవాడ రూరల్ (గొల్లపూడి) – (ఎన్టీఆర్ జిల్లా) : మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన శాఖమూరి వెంకటకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం గొల్లపూడి గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి కుమార్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.