మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

ప్రజాశక్తి-చిన్నగంజాం:  ప్రాధాన్యతా క్రమంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని చిన్నగంజాం, కారంచేడు మండలాలలో విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నగంజాం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్లెపాలెం, పెద్దగంజాం గ్రామాల్లో మత్స్యకారులు సమస్యల గురించి ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్కడ నుంచే నేరుగా ఫోను ద్వారా మత్స్యశాఖ ఏడీతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, బోట్లు సబ్సిడీలు మంజూరు చేయించేందుకు కషి చేస్తానన్నారు. మత్స్యకార పెద్దలందరూ వెళ్లి ఫిషరీస్‌ ఏడీని కలిసి వినతిపత్రం అందించాల్సిందిగా సూచించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ చిన్నగంజాం మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ కలాం ఆజాద్‌ సతీమణి సయ్యద్‌ ఖాజున్నీసా బీబీ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న స్వర్ణ గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్‌ బండారు సిరాబందిని ఏలూరి సాంబశివరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పదవీరయ్య, చిన్నగంజాం పెద్దగంజం సర్పంచులు రాయని ఆత్మారావు, నక్కల కష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️