ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండలం తాటిపాక గ్రామంలో అభివృద్ది పనులకు ఆటకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని రాజోలు ఎంఎల్‌ఎ దేవ వరప్రసాద్ అన్నారు. బుధవారం తాటిపాక లో సర్పంచ్ కోటిపల్లి రత్నమాల అధ్యక్షతన జరిగిన పల్లె పండుగ కు ఎంఎల్‌ఎ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ … తాటిపాక గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య, మార్కెట్ భవన నిర్మాణ సముదాయాల ఆధునికీకరణకు ఎవరైనా ఆటకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తాటిపాక హైస్కూల్ గ్రౌండ్ ను ఆధునీకరిస్తామన్నారు. తాటిపాక గ్రామం అభివృద్ధికి అంతా కలిసిగట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ పెడ్ డైరక్టర్ జి.పెదకాపు,ఎంపిపి కేతా శ్రీనివాస్,తహసీల్దార్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్,ఇన్ చార్జ్ ఎంపిడిఒ జి.భీమారావు,వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు,ఎంఇఒ టి ప్రసాద్,పంచాయితీ కార్యదర్శి తాడి ఏసుబాబు, నాయుకులు గెడ్డం మహలక్ష్మీ ప్రసాద్,బోణం నాగేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ కటికరెడ్డి బుజ్జి,సూరిశేట్టి శ్రీనివాస్,చాగంటి స్వామి,ముప్పర్తి నానీ, అడబల విజయ్, పలువురు పాల్గొన్నారు.
