విజయవాడ (ఎన్టీఆర్ జిల్లా) : ఉపాధ్యాయ, ఉద్యోగుల తరపున శాసన మండలిలో గళమెత్తే నాయకులు ఎంఎల్.సీ కెయస్.లక్ష్మణ రావు ను గెలిపించాలని వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బాలోత్సవ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గన్న యు.టీ.యఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ … అందరికి నిత్యం అందుబాటులో ఉండే ప్రజల మనిషి, నిత్య కఅషీవలుడు, మేధావి, విద్యావేత్త, అయిన ఎం. ఎల్.సి. కెఎస్.లక్ష్మణ రావుని గెలిపించుకోవడం ఉపాధ్యాయుల మీద, ఉద్యోగుల కార్మిక వివిధ ప్రజాసంఘాల మీద యుటీయఫ్ సంఘం మీద ప్రధాన బాధ్యత గా ఉంది అని అన్నారు. అదేవిధంగా విద్యారంగ ప్రయోజనాలు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి అంటే శాసన మండలిలో పి.డీ.ఎఫ్ ఎంఎల్.సీ లు ఉండాలి అని గుర్తు చేస్తూ 2025 మార్చి లో జరగబోవు ఎం.ఎల్.సీ ఎన్నికలలో కృష్ణ , గుంటూరు జిల్లా పట్టభధ్రుల నియోజక వర్గ శాసనమండలి ఎన్నికలలో కె.యస్ లక్ష్మణ రావుకి ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణ రావు మాట్లాడుతూ … ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక పర్యాయాలు ఎం.ఎల్ .సి ఎన్నికల లో విజయం సాధించామన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజా సంఘాల పోరాటాలు, నాయకత్వం త్యాగాలు, వారి మీద ఉన్న నమ్మకం వంటి ఉన్నాయన్నారు. మరోసారి సంఘం బలం నెట్ వర్క్ ను ఉపయోగించి పని చేసీ మార్చిలో జరగబోయే ఎంఎల్.సీ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన యుటీఎఫ్ ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ … 14 సంవత్సరాల కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనాల సాధించడం కోసం పి. డీ. ఎఫ్ శాసన మండలి సభ్యులు అనేక పోరాటాలు , ప్రాతినిధ్యం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా టీచర్ అప్రెంటిస్ షిప్ రద్దు కోసం పి.డీ. ఎఫ్ ఎం. ఎల్.సీ కె.ఏస్. లక్ష్మ ణ రావు ఆమరణ దీక్ష చేసి సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి కఅష్ణ జిల్లా లో అనేక ప్రజా సంఘాల ద్వారా పలు సమస్యలు ప్రజా ప్రతినిధుల, అధికారుల దఅష్టికి, తీసుకు వెళ్లి ప్రభుత్వాలకు, సంఘాలకు వారధీగా కె.ఎస్.లక్ష్మణ రావు అద్వితీయమైన పాత్ర పోషించారు అని అన్నారు. సీ.ఐ.టి.యు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి యన్. సి.హెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ … నిత్యం సంఘటిత రంగం, అసంఘటిత రంగంలో గల కార్మికల సమస్యలు గురించి శాసన మండలిలో బయట ప్రస్తావిస్తూ వారికి మద్దతుగా ఉండే కెఎస్.లక్ష్మణ రావు కే సంఘం మద్దతు వుంటుంది.అని చెప్పారు. కె ఎస్ లక్ష్మణ రావు గెలుపు కోసం సి .ఐ .టి. యూ నాయకత్వం పని చేయాలని పిలుపునిచ్చారు. యుటీయఫ్ రాష్ట్ర కార్యదర్శి యస్ పి మనోహర్ కుమార్ మాట్లాడుతూ … 2010, 2015 మెరుగైన పీ.ఆర్.సీ లో మెరుగైన ఫిట్మెంట్ ఇప్పించడంలో పి.డీ.ఎఫ్ ఎం ఎల్.సి చేసిన కృషిని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో మధ్యతరగతి ప్రజాసంఘాల కన్వీనర్ విజయ ప్రకాశ్, సి.ఐ.టి.యు నాయకులు సుధాకర్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యన్.సుప్రజ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కమల, ఎల్. ఐ సి నాయకులు యు.వి. కఅష్ణయ్య, వి.సాంబి రెడ్డి, యు టీ యఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంత రావు, డి వై. యఫ్. ఐ నాయకులు ఏ.నాగేశ్వర రావు, యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే శ్రీనివాసరావు, ఏ.సుందరయ్య, జిల్లా సహాధ్యక్షులు ఎం.కఅష్ణయ్య, సహాద్యక్షురాలు పి.లీల, జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరరావు, తదితరులు మద్దతిస్తూ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమం లో ఎల్ ఐ సి నాయకులు ఇ వి తులసీ రావు, మెడికల్ రిప్స్ నాయకులు యు.వి కృష్ణయ్య, బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల నాయకులు కె. ఎస్. సీ. బోస్, ఎల్. ఐ .సి పెన్షనర్స్ నాయకులు ఎన్. గోపాలకృష్ణ, డి.వై. ఎఫ్. ఐ నాయకులు ఎన్.నాగేశ్వర రావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు శ్రీనివాస్, యు.టీ.యఫ్ జిల్లా కార్యదర్శులు డి.హరిప్రసాద్, బి.రెడ్ స్టార్, షేక్ ప్రైమర్ సాహెబ్, కె.మల్లికార్జున రెడ్డి అన్ని ప్రజా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్.సీ కెయస్.లక్ష్మణ రావు ను గెలిపించండి : వివిధ ప్రజా సంఘాల పిలుపు
