కేంద్ర పథకాల అమలుపై పరిశీలన

కేంద్ర పథకాల అమలుపై పరిశీలన

ప్రజాశక్తి- పద్మనాభం : మండలంలోని అయినాడ, కోరాడ గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో కేంద్రబృందం సోమవారం పర్యటించింది. కేంద్ర పథకాల అమలు తీరుపై పరిశీలించింది. అనిల్‌ గైక్వాడ్‌, అనిల్‌ నింబోల్కర్‌లతో కూడిన బృందం ఆయా పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పధకం పనులు, గ్రామ పంచాయతీ, ,రైతు భరోసా కేంద్రాలు, హర్టీకల్చర్‌, హౌసింగ్‌, స్వయం సహాయక సంఘాల నిర్వహణ, భూరికార్డుల పరిశీలన వంటి పలు అంశాలను పరిశీలించారు. మహిళా సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో డిపిఎం సంజరు, వైదేహి, ఎపిఎం ఆదినారాయణ, ఎంపిడిఒ ఎం.విజయకుమార్‌, ఇఒపిఆర్‌డి కెవిఎన్‌కుమార్‌ మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు

మహిళలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

➡️