దోమకాటు ఆరోగ్యానికి చేటు

 చిలకలూరిపేట: జాతీయ డెంగీ దినోత్సవం సంద ర్భంగా గురువారం మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ ఆర్‌.సి.హెచ్‌ నారా యణ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లా డుతూ దోమకాటు ఆరోగ్యానికి చేటు అని, నీటి నిల్వలను ఉంచరాదని అవి దోమల వ్యా ప్తికి పుట్టినిల్లని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని సూచిం చారు. దోమలు కుట్టకుండా వేపాకు, లిక్విడ్స్‌ తప్పనిసరిగా వాడాలన్నారు. అంతేకాకుండా దోమ తెరలు, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్య క్రమంలో సూపర్‌వైజర్లు చల మారెడ్డి, శివయ్య, జిలాని కోటేశ్వరరావు, సయ్యద్‌ పీర్‌ పాల్గొన్నారు.

మాచర్ల: పట్టణంలోని మలేరియా సబ్‌ యూనిట్‌లో జాతీయ డెంగీ దినోత్సవ వేడుకలు యూనిట్‌ అధికారి డి.లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.రెండు వారా లకు మించి నీటి నిల్వలను ట్యాంక్‌లలో ఉంచకూడదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విపి సౌత్‌ సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది టి.నాగే శ్వరరావు, బాలయ్య, బాషా, దానం పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి మలేరియా యూనిట్‌ సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని మాచర్ల పట్టణ ప్రజలు కోరు తున్నారు. ఇళ్ళ ముందు మురుగు కాల్వ లను శుభ్రం చేయకపోతే వచ్చే రోగాల గురించి ముందుగా మున్సిపల్‌ సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. పట్ట ణంలో చెత్తకుప్పల తొలగింపులో అల సత్వం, దుర్వాసన వంటి వాటిపై మున్సిపల్‌ సిబ్బంది, అధికారులకు అవ గాహన వస్తే పట్టణ ప్రజల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.

➡️