జాతీయస్థాయి స్క్వే మార్షల్ పోటీలకు మదర్ థెరిసా విద్యార్థులు

Nov 27,2024 15:50 #krishna

ప్రజాశక్తి – చల్లపల్లి : డిసెంబర్ 7, 8 ,9వ తేదీలలో హర్యానా లో జరిగే జాతీయస్థాయి స్క్వే మార్షల్ పోటీలకు చల్లపల్లి సెయింట్ మదర్ థెరీసా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికైనట్లు స్కూల్ కరెస్పాండెంట్ ఆండ్రూ గోమ్స్ బుధవారం తెలిపారు. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ లో భాగంగా ఈనెల 24, 25వ తేదీలలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి స్క్వే ఛాంపియన్ షిప్ పోటీలలో తమ పాఠశాల నుండి అయిదుగురు విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించినట్లు చెప్పారు. విజేతలను కరస్పాండెంట్ ఆండ్రూ గోమ్స్, ప్రిన్సిపల్ ప్రశాంతి గోమ్స్, కోచ్ సుబ్బు, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అభినందించారు. బంగారు పతకాలు సాధించిన నలుగురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.

➡️