ప్రజాశక్తి-మార్కాపురం : స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఆ పాఠశాల ప్రధానో పాధ్యాయుడు మునగాల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాతృ భాషతో విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం, శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, ధారణ శక్తిని పెంపొందించే ప్రక్రియలు మన తెలుగు భాష గొప్పతన మని ఉపాధ్యాయుడు ఒద్దుల వెంకట వీరారెడ్డి అన్నారు. అందులో అవధానం అతి ముఖ్యమైన ప్రక్రియ అని, సమాజంలో మంచి చెడుల విశ్లేషణ, జీవన విధానం గురించి, శతకాలు, కవితలు, సాహిత్యం వంటివి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయన్నారు. మానవ జీవన విధానాన్ని నిర్దేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు వీరారెడ్డితో పాటు బి ఉమాదేవి, ఎస్ భాస్కర్‌రెడ్డి, పి వెంకటేశ్వర్లు, సమీఉల్లా, ప్రసాద్‌స్వామి తదితరులు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు భాషా సౌరభం విభాగంలో ఉపన్యాసాలు, లఘు నాటికలు, నిజ జీవితంలో మాతృ భాష వినియోగం విభాగంలో కథలు, పాటలు, పద్యాలు, వక్తృత్వం, స్థానిక వనరులను వినియోగించి భోధన అభ్యసన సామగ్రి తయారీ తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సక్రునాయక్, జె సునీత, డి ఎలిజబెత్‌రాణి, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
