ప్రజశక్తి-రొద్దం (అనంతపురం) : రోడ్డుపై మట్టికుప్పలతో వాహనదారులకు సమస్యలగా మారింది. మండలంలోని రొద్దంలో పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో మెయిన్ బజార్లో నుంచి వైస్సార్ విగ్రహం వరకు రెండు వరుసలా సిమెంట్ రోడ్డు ఉంది. అయితే రోడ్డుపై పెద్ద పెద్ద మట్టి కుప్పలు ఉండడంతో వాహనాలు ఎదురుఎదురుగా వచ్చినప్పుడు ఇబ్బందిగా మారినట్లు వాహనదారులు వాపోతున్నారు. దీంతో రోడ్డుపై సమస్యలు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. కావున అధికారులు, నాయకులు పట్టించుకొని ఈ సమస్యకు పరిష్కారం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
