పిడుగుపాటుకు మృతి చెందిన దంపతుల కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎంపి బి.కె.పార్థసారథి

Sep 29,2024 13:01 #family, #MP BK Parthasarathy, #support

ప్రజాశక్తి -పెనుకొండ టౌన్‌ (అనంతపురం) : పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లిలో ఆదివారం పిడుగుపాటుకు దంపతులు మృతి చెందడం పట్ల హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుండి ఫోన్‌ చేసి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి చెందడం బాధాకరం అని, వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ప్రభుత్వం వీరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎక్స్‌ గ్రేషియా ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

➡️