ఎంపీ, కమిషనర్‌ తొలి భేటీ

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఎంపీ బస్తిపాటి నాగరాజు, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఏ.భార్గవ్‌ తేజ గురువారం నగరపాలక కార్యాలయంలో తొలిసారి మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీకి కమిషనర్‌ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తానని, నగరానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ అన్నారు. అనంతరం నగరంలో చేపట్టిన అభివృద్ధి, పలు సమస్యలపై ఎంపీ, కమిషనర్‌ చర్చించారు.

➡️