చిత్తూరు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది : ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

గంగాసాగరం (చిత్తూరు) : చిత్తూరు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి చిత్తూరు సమీపంలోని గంగాసాగర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన పై చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తక్షణం స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే సమయంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడడం, 22 మంది గాయాల పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు తామంతా బాసటగా నిలుద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.

➡️