ఉపాధి పనులు పరిశీలించిన ఎంపీడీవో

Apr 15,2025 13:13 #employment work, #MPDO inspects

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : మండలంలోని పెద్దతుంబలం, కడితోట గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడుతూ … కొలతల ప్రకారంగా పనులు నిర్వహించాలని, కూలీలకు నష్టం జరగకుండా హాజరులు సక్రమంగా వేయాలని కోరారు.ఉపాధి హామీ పనులు ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని పనుల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అన్నారు.

➡️