ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : సోమల మండలం వల్లిగట్ల పంచాయతీలు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ఎంపీడీవో నారాయణ శుక్రవారం పరిశీలించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి ఆయన సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించి నాన్నగారిమాణాలు పాటించి రోడ్ల నిర్మాణం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయశంకర్, ఉపాధి జేఈ తదితరులు పాల్గొన్నారు.