జనసేనలో చేరిన ఎంపిపి, వైస్‌ ఎంపిపి

Sep 30,2024 21:46

 ప్రజాశక్తి – డెంకాడ : స్థానిక ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి కూరాకుల అనిత సోమవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సమక్షంలో జనసేనపార్టీలో చేరారు. వైసిపిలో ఉన్న వీరితోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు కూడా జనసేనలో చేరారు. ఇటీవల ప్రజాశక్తిలో ఎంపిపి పార్టీ మారుతున్నట్లు కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈనేపథ్యంలో వారు జనసేనలో చేరడంతో మండలంలో చర్చనీయాంశమైంది.

➡️