ప్రజాశక్తి – సామర్లకోట : సమాజంలో బాల్యవివాహాల కు సహకరించే తల్లిదండ్రులతో పాటు పురోహితులు భార్యాభజంత్రీలు వంటవారు కూడా శిక్షార లేనని సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ మెప్మా కార్యాలయంలో సి ఎం ఎం సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల పిల్లలకు అనారోగ్యం కలగడమే కాకుండా పుట్టే బిడ్డలు రక్తహీనత పుడతారని ప్రతి మండల సమాఖ్య సమావేశంలో బాల్యవివాహాలు నిరోధంపై ప్రత్యేక అజెండా అంశంగా పెట్టి చర్చించాలని సూచించారు. అలాగే స్థానిక బచ్చు పౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, ప్రముఖ న్యాయవాది కొర్లమండ శ్రీవాణి లు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసినట్లయితే బాలబాలికలకు అనారోగ్యం కలుగుతుందని ప్రోత్సహించిన పెద్దలు కూడా తల్లిదండ్రులతో పాటు శిక్షార్హులు అవుతారని చెప్పారు. బాల్య వివాహాలు వల్ల ఏర్పడే సమస్యలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ వీ రాజు, మానవ హక్కుల సంఘం జిల్లా నాయకులు ఎస్ రెహమాన్, జుత్తుగ అప్పారావు, ఎండి భాషా, ఉపాధ్యాయులు జి గోవిందు ,లీలా కుమారి ,డివిఆర్ఎన్ వల్లి, మున్సిపల్ సి ఓ లు పి ప్రసాద్ బాబు వి వెంకటలక్ష్మి రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.