ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్ మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలో మున్సిపల్ మస్టర్ పాయింట్ వద్ద రిలే దీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బరావమ్మ కార్మికులకు పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా చాలీచాలని నామమాత్రపు వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. కార్మికులకు ఒక పే స్కేలు, డిఎ, గ్రాడ్యుటీ, పెన్షన్ లేదని వాపోయారు. 5-6 ఏళ్లకు పెంచే అరకొర వేతనం తప్ప ఎటువంటి ఎదుగు బొదుగులేని బానిస బతుకులు బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 8, 9 పిఆర్‌సి ల ప్రకారం కనీస వేతనం రూ. 3,900 నుంచి రూ. 6,700 పెంచారని చెప్పారు. 2014లో ప్రభుత్వ ఉద్యో గులకు మధ్యంతర భతి చెల్లించిన సందర్భంలో మున్సిపల్ కార్మికులకు కూడా రూ. 1,600 పెంచారని తెలిపారు. 2013లో పిఆర్‌సి వేతనాలు మధ్యంతర భతి కరువు భత్యం, హెచ్‌ఆర్‌ఎ అమలు చేసేందుకు 1615 ను జారీ చేశారని .దీనిని సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిందని, ఇప్పటికే 7 నెలలు గడుస్తున్నా మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం పరిష్కరిం చడానికి సమయం లేకుండా పోయిందన్నారు. ఇంజినీర్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్పందించి పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను ఉదతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్, కార్యదర్శి సత్యం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ కుమార్, అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, నాగన్న శివన్న, చెన్నయ్య , మైకేల్ పుల్లయ్య, పుళ్ళమ్మ, తిరుపాలమ్మ్, రవి, వెంకట లక్ష్మీ, ప్రభావతి, లక్ష్మి, అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలు బి.లక్ష్మీదేవి , ఆర్.లక్ష్మీదేవి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ లక్ష్మీదేవి, సలిమ్మ, కళావతి, వరలక్ష్మి, కుసుమావతమ్మ , పారిశుధ్య కార్మికులకు మద్దతు తెలిపి అందరూ పాల్గొన్నారు.ప్రొద్దుటూరు : అపరిషృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘ నాయకులు విజయకుమార్, సాల్మన్ అన్నారు. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్,యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఒక రోజు రిలేదీక్ష చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సమ్మెకారణంగా పర్మినెంట్ చేస్తానని చెప్పి మోసం చేసిందని గుర్తు చేశారు దీక్షలో దేవదానం, స్వామిదాసు,సుధాకర్, జైకుమార్, సురేష్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియుప్రజాశక్తి-కడప అర్బన్ : నగరంలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రామమోహన్, నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్త రిలే నిరాహార దీక్షల్లో భాగంగా నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. 300 మంది కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులంటే ఈ ప్రభుత్వాలకు చాలా చులకన అయిపోయిందని విమర్శించారు. 20 ఏళ్లు పైబడి పని చేస్తున్న వారికి ఎటువంటి పర్మినెంట్ చేసే ఉద్దేశం కనపడటం లేదని తెలిపారు. అలాగే కోవిడ్ -19లో ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి కార్మికులను కనీసం ఆప్కాస్‌లో చేర్చాలని, అడిషనల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో36 ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్‌లు వెంటనే చెల్లించాలని చెప్పారు. సకాలంలో ఒప్పంద జీతాలను విడుదల చేయాలని కోరారు. ఇంజినీరింగ్ కార్మికులకి 36వ వితరణ సవరణ ప్రకారం జీతాలు ఇవ్వాలని పేర్కొన్నారు. క్లాప్ డ్రైవర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిముట్లు నాణ్యమైనవి కార్మికులకు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకునేందుకు పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, మున్సిపల్ ఫెడరేషన్ నాయకులు సుంకర రవి, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి గోపి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం కడప నగర కమిటీ నగర అధ్యక్షులు చంద్ర రెడ్డి గారు మున్సిపల్ పెడరెషన్ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపాల్, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి విజయభాస్కర్, కార్మికులు పాల్గొన్నారు.