ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలోపనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాలుగు గంటల నుండి విధులు బహిష్కరించి సంపూర్ణ సమ్మెకు సిద్ధమైనట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కర్నూల్ నగర కమిటీ అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనేక సందర్భాల్లో తమ సమస్యల పరిష్కరించాలని అధికారులకు విన్నవించిన ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్ల ఈనెల తొమ్మిదవ తేదీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం , నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీలు నిర్వహించి మా సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ్మీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కార్మికులకు 21000, స్కిల్ సెమిస్కిల్ కార్మికులకు 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 10 సంవత్సరములు సర్వీసు ఉన్నవారికి పర్మినెంట్ చేయాలని కోరారు, జీవో నెంబర్ 63 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి పెర్మనెంట్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ కింద పది లక్షల రూపాయలు కనీస పెన్షన్ 10000 రూపాయలు ఇవ్వాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సాధారణ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి 5 లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే 15 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అనారోగ్యాల కారణాలవల్ల విధి నిర్వహణ చేయలేని కార్మికుని బదులుగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. సరెండర్ లీవ్ ప్రతిఫలాలను అమలు చేయాలని, 65 ఆదివారాలు, 17 జాతీయ పండుగలు, రెండవ శనివారాలలో కూడా పనిచేయుచున్నాము. కావున 84 రోజులకు సెలవు దినాలుగా అయినా ప్రకటించాలన్నారు. కార్మికులకు యూనిఫాం రక్షణ పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు పైన పేర్కొన్న న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పోరాడుతుందని, పై సాధన కోసం తాను ఈ సమస్య పెడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సమ్మెలో ప్రధాన కార్యదర్శి హెచ్. యూనిస్ బేగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. రంగ ,కోశాధికారి ఈ, వెంకటేశ్వర్లు ,కె.జ్ఞానమ్మ దాదాపు 300 మంది కార్మికులు పాల్గొన్నారు.
