ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ … మునిసిపల్ వర్కర్స్ పెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం మునిసిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి మునిసిపల్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాల వెంకట్రావు మాట్లాడుతూ … మున్సిపాలిటీలో ఏళ్ళ తరబడి సేవలు అందించి మరణించిన, అనారోగ్యంపాలైన వారి స్థానంలో వారి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, కాంటాక్ట్ కార్మికుల రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలు ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో కార్మికులకు జీతాలు బకాయిలు చెల్లించాలని, ఇంజినీరింగ్ కార్మికులకు జిఓ నెంబర్ 36 ప్రకారం జీతాలు ఇవ్వాలని, కార్మికులకు సరిపడగా పనిముట్లు ఇవ్వాలని, పి.ఎఫ్,ఈ ఎస్ ఐ బకాయిలు చెల్లించాలన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొడమంచిలి బాబు, తాడికొండ జయరాం, అల్లం పూర్ణిమ, తాడికొండ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
