మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్కాస్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలి : మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్‌ లో పనిచేస్తున్న మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, జీవో నెంబర్‌ 36 ప్రకారం ఇంజనీరింగ్‌ కార్మికులందరికీ 21వేల రూపాయల వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.అప్కాస్‌ లో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు కే మహమ్మద్‌ గౌస్‌, సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు భాస్కరాచారి, నంద్యాల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్‌,ఉపాధ్యక్షులు రామకఅష్ణ,బాలదుర్గన్న, ఆదాము, సహాయ కార్యదర్శులు కఅష్ణయ్య, మురళి, సిద్దయ్య వీరితోపాటు మరో వంద మంది స్ట్రీట్‌ లైటింగ్‌, వాటర్‌ వర్క్స్‌,పంప్‌ హౌస్‌,ఆఫీస్‌ స్టాఫ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, కార్మికులు తదితరులు పాల్గన్నారు. ఈ సందర్బంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కే మహమ్మద్‌ గౌస్‌ సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌,మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు భాస్కరాచారి, నంద్యాల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్‌, లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వాటర్‌ వర్క్స్‌, స్ట్రీట్‌ లైటింగ్‌, ఆఫీస్‌ స్టాఫ్‌, పంప్‌ హౌస్‌ వర్కర్స్‌, వాల్‌ ఆపరేటర్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్స్‌ మొత్తం 268 మంది కార్మికులు ఆప్కాస్‌ లో పనిచేయడం జరుగుతుందన్నారు. ఇటీవల మంత్రివర్గం రద్దు చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయని,ఆప్కాస్‌ రద్దు చేస్తే ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించకుండా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.ఇటీవల మున్సిపాలిటీలలో పనిచేస్తూ తులసిరామ్‌ మధు, బసవయ్య, రాజశేఖర్‌ లు చనిపోవడం జరిగింది. వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబం ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా 7 లక్షలు ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ శాఖలలో మాదిరిగానే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 62 సంవత్సరాల పదవి విరమణ వయస్సు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యాలను కల్పించాలి.దహన సంస్కారాలకు 20వేలు ఇవ్వాలి.సంక్షేమ పథకాలు అమలు చేయాలి.రిస్క్‌ అలవెన్స్‌, టి. ఎ, డి. ఎ లు చెల్లించాలి.రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ (10సంవత్సరాలకు 75,000/-) ఇవ్వాలి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలరని కోరారు.

➡️